Gold-Silver Price: బంగారానికి ఉన్న డిమాండ్ ను ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. మన దేశంలో పసిడి కొనుగోలు గురించి అయితే… ఇంకా ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. మన దేశంలో బంగారానికి చాలా ప్రధాన్యత ఇస్తారు. ఏ చిన్న పండగ వచ్చిన సరే బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడిపోతారు. అయితే… గత రెండురోజులుగా ఆకాశాన్ని తాకినా బంగారం ధరలు.. నేడు నేలచూపులు చూస్తున్నాయి. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 40తగ్గి.. నేడు రూ. 4,320లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధరపై రూ. 400లు తగ్గి.. రూ. 43,200లకు చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధరపై రూ.43 తగ్గి రూ 4,713లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 430 మేర తగ్గి నేడు రూ 47,130 లు నమోదైంది. ఇవే ధరలు విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.
వెండి ధర: నేడు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.64,900కు పడిపోయింది. నిన్నటితో చూస్తే.. కిలో వెండి ధర రూ. 200మేర తగ్గింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.07 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1748 డాలర్లకు పడిపోయింది.వెండి రేట్లలో కూడా తగ్గుదల కనిపించింది. ఔన్స్‌కు 0.13 శాతం మేర తగ్గి.. 22.65 డాలర్లకు చేరింది.
అయితే.. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అనేకం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటన, ప్రపంచవ్యాపంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపాయి. బంగారం ధరలు వచ్చే వారం కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.