Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నేడు మరో కీలక పరిణామాలు జరుగనున్నది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరుగనున్నది. ఒక్క చైర్మన్లు మాత్రమే కాదు.. వైస్ ఛైర్మన్ల ఎన్నిక కూడా జరుగనున్నది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీటీసీలు సమావేశమై జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
ఇప్పటికే వైసీపీ ఆయా జిల్లాలకు సంబంధించిన ఛైర్మన్లను సెలెక్ట్ చేసి.. ఆ మేరకు భీ ఫారాలు పంపింది. జిల్లా రిజర్వేషన్లకు అనుగుణంగా జెడ్పీ ఛైర్మన్లను ఎంపిక చేసినట్టు వైసీపీ తెలిపింది. ఇదే సమయంలో ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా జరుగును. జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్ ఆధారంగా..ఇతరులకు ఆ రెండు పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆ జాబితాను జిల్లాలకు పంపింది. మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది
ఉదయం పది గంటల వరకు నామినేషన్ల స్వీకరణ. అనంతరం స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక ఉండనుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. అనంతరం .. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
13 జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు వీరే..
విజయనగరం జడ్పీ ఛైర్మన్ – మజ్జి శ్రీనివాస్
శ్రీకాకుళం జడ్పీ ఛైర్పర్సన్ – పిరియా విజయ
విశాఖపట్నం జడ్పీ ఛైర్మన్ – అరిబిరా
తూర్పుగోదావరి జడ్పీ ఛైర్మన్ – విప్పర్తి వేణుగోపాల్
పశ్చిమ గోదావరి జడ్పీ ఛైర్మన్ – కౌరు శ్రీనివాస్
కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ – ఉప్పాళ్ల హారిక
గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ – క్రిస్టినా
ప్రకాశం జడ్పీ ఛైర్మన్ – బూచేపల్లి వెంకాయమ్మ
నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్ – ఆనం అరుణమ్మ
కర్నూలు జడ్పీ ఛైర్మన్ – వెంకట సుబ్బారెడ్డి
చిత్తూరు జడ్పీ ఛైర్మన్ – వి.శ్రీనివాసులు
కడప జడ్పీ ఛైర్మన్ – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
అనంతపురం జడ్పీ ఛైర్మన్ – బోయ గిరిజమ్మ
స్థానిక సంస్థలు అన్నింటా వైసీపీ హావా చాటింది. దాదాపు అన్ని జిల్లాల్లోని జెడ్పీలు, కార్పోరేషన్లు, అన్నింటా వైసీపీ నేతలే ఛైర్మన్లుగా కొలువుదీరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి
వైసీపికి ఫ్లస్ పాయింట్ కానున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.