మ‌గువల‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు బిగ్ షాకింగ్ న్యూస్. గ‌త వారం రోజుల నుంచి త‌గ్గుతూ వ‌చ్చిన ధ‌రలు ఒక్క సారిగా భారీగా పెరిగాయి. గ‌త వారం రోజుల నుంచి బంగారం, వెండి ధ‌రలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కాగ ఈ రోజు కొనుగోలు దారుల‌కు బిగ్ షాక్ ఇస్తు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్లకు రూ. 450 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం పై రూ. 490 పెరిగింది. అలాగే కిలో గ్రాము వెండిపై కూడా రూ. 400 పెరిగింది.

కాగ గ‌త వారం 26 వ తేదీ నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుతూనే ఉన్నాయి. ఈ వారం రోజుల్లో బంగారం ధ‌ర రూ. 610 పెరిగింది. అలాగే మ‌రో మూడు రోజులు నిల‌క‌డ‌గా ఉంది. వెండి కూడా ఈ వారం రోజుల్లో రూ. 2,500 వ‌ర‌కు పెరిగింది. అలాగే మ‌రో రెండు రోజుల పాటు ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. ఇప్పటి వ‌ర‌కు బంగారం ధ‌రలు త‌గ్గ‌డంతో బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది. ఈ ఒక్క రోజు పెర‌గ‌డంతో మ‌రో సారి బంగారం ధ‌రు రూ. 52 వేల మార్క్ దాటింది.

పెరిగిన ధ‌ర‌లతో తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప్ర‌ధాన న‌గ‌రాలు అయిన హైద‌రాబాద్, విజ‌యవాడ‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల.. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,100 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,470 కి చేరుకుంది.
అలాగు కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,700 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version