ఐపీఎల్ 2022 లో భాగంగా శుక్రవారం కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఢి కొట్టింది. ఈ మ్యాచ్ లో కోల్ కత్త నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టు బ్యాట్స్ మెన్లు వరుగా విఫలం అవుతున్న సమయంలో స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 8 సిక్స్ లతో బౌండరీల వర్షం కురిపించాడు. రస్సెల్ విద్వంసక బ్యాటింగ్ తో కోల్‌కత్త టార్గెట్ చిన్న బోయింది.
ఒక సమయంలో కోల్‌కత్త గెలవడం కష్టం అని అనుకున్నారు. కానీ రస్సెల్ దూకుడైనా బ్యాటింగ్ తో కేవలం 14.3 ఓవర్లోనే టార్గెను అందుకుని విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఈ సీజన్ లో కోల్‌కత్త రెండు మ్యాచ్ లు గెలిచి.. పాయింట్ల పట్టిక లో అగ్ర స్థానంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ను ఉమేశ్ యాదవ్ పదునైనా బంతులతో విరుచుకుపడ్డాడు.
ఉమేశ్ యాదవ్ 4 ప్రధాన వికెట్లను తీసి పంజాబ్ ను దెబ్బతీశాడు. మొదట్లో రాజ్ పక్స (31), చివర్లో రబడ (25) మినహా అందరూ విఫలం అయ్యారు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చిన ఉమేశ్ యాదవ్ కు ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.