ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు..

-

నిన్నభారీగా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో స్థిరంగా నిలిచాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 39,770 రూపాయల వద్ద ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 36,460 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులకు గురికాలేదు. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,650 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కదలిక లేకుండా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం స్థిరంగా 38,400 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 37,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర కూడా నిలకడగా 46,650 రూపాయల వద్ద ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news