భారీగా పెరిగిన బంగారం ధరలు…55 వేలకు చేరువలో

-

బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

 

 

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి, రూ. 54,490 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి, రూ. 49, 950 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి, రూ. 73,000 గా నమోదు అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news