ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచే అద్భుతమైన మొక్క..!

-

ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అతిబల మొక్క కూడా ఒకటి.. దీనిని అడవి బెండకాయ, ముద్ర బెండ లేదా తుత్తూరు బెండ అంటారు. ఈ చెట్టుని దువ్వెన చెట్టు లేదా మధ్వ చెట్టు అని కూడా అంటారు. ఈ అతిబల చెట్టు గుండెకు మరియు నరాలకు, కిడ్నీలకు, కాలేయ మరియు కాన్సర్ సంబంధిత వ్యాధులకు ఇంకా అనేకరకములైన వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ అతిబల ఆకు చూడడానికి రావి చెట్టు ఆకులానే ఉంటుంది. కానీ వీటి అంచులు రంపపు పళ్ళను పోలి ఉంటాయి. వీటి ఆకులు పసుపు గాను, కాయలు అశోక చక్రం ఆకారంలోనూ ఉంటాయి. వీటి గింజలు చిక్కడు గింజలు ఆకారంలో ఊదా రంగులో ఉంటాయి. అతిబల మొక్క అత్యంత బలమైన ఆకు. అతిబల మొక్కలో అన్ని భాగాలు వైద్యానికి సంబంధించినవే అని నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా వెయ్యి రోగాలను నయం చేసే శక్తి ఈ మొక్కలో దాగి ఉంది. సకల రోగాలకు ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. గడిచిన పది సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటం చేస్తూ ఎంతో మంది క్యాన్సర్ రోగులకు జీవితాన్ని ప్రసాదించింది. మరి ఎన్నో వ్యాధులను నయం చేసే ఈ అతిబల మొక్క ఏ విధంగా మానవుని శరీరానికి ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే.. డయాలసిస్, కిడ్నీలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ అతిబల మొక్క యొక్క కషాయాన్ని తీసుకోవడం వల్ల పరిష్కారం త్వరగా లభిస్తుంది.

మహిళలలో సంతానోత్పత్తి ని పెంచడానికి.. పిసిఒడి, థైరాయిడ్ ,హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఎండోమెట్రియాసిస్ సమస్యలను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మగవారిలో వీర్యకణాల శక్తిని పెంపొందించడానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే నరాల బలహీనత, ఫిట్స్ ఉన్నవారికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఆస్తమా, నిమోనియా, జలుబు వంటి శ్వాస కోస వ్యాధులకే కాకుండా సోరియాసిస్, బుల్లి మచ్చలు, డ్రై ఎగ్జిమా వంటి చర్మవ్యాధులకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news