రెండు రోజుల నుంచీ భారీగా దిగొచ్చిన బంగారం ధర ఈ రోజు పైపైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పైకి కదిలింది. దీంతో పసిడి ధర రూ.38,200కు పెరిగింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ఈ పసిడి ధర కూడా రూ.270 పైకి కదిలింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ రూ.42,050కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర కేజీకి రూ.49,150కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.300 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరిగింది. దీంతో ధర రూ.40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.50 పెరుగుదలతో రూ.49,150కు చేరింది.