పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం దిగొచ్చింది. సోమవారం రూ.42,050 వద్ద ఉన్న బంగారం ధర శనివారం నాటికి రూ.41,050కు తగ్గింది. అంటే రూ.1,000 పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం స్థాయిలో పడిపోలేదు. వారం ఆరంభంలో రూ.38,200 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటికి రూ.రూ.38,090కు చేరింది. అంటే రూ.110 దిగొచ్చింది.
బంగారం ధర వెలవెలబోతూ ఉంటే కేజీ వెండి ధర మాత్రం ర్యాలీ చేసింది. వారం ఆరంభంలో రూ.49,150 వద్ద ఉన్న వెండి ధర శనివారం చివరకు వచ్చేసరికి రూ.49,400కు ఎగసింది. అంటే వెండి ధర రూ.250 పైకి కదిలింది. ప్రస్తుతం బంగారం ధర తగ్గినా కూడా వచ్చే కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.