రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు కూడా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.50 క్షీణించింది. దీంతో ధర రూ.38,690 నుంచి రూ.38,640కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. రూ.90కు పడిపోయింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,240 నుంచి రూ.42,150కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,000 నుంచి రూ.48,800కు పడిపోయింది.
ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50 క్షీణించింది. దీంతో ధర రూ.40,650కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 క్షీణతతో రూ.39,450కు తగ్గింది. ఇక బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 తగ్గుదలతో రూ.48,800కు క్షీణించింది.