ఏపీ బోర్డర్ లో మట్టిదిబ్బలో బంగారు నాణాలు.. పండగ చేసుకున్న జనం

-

ఏపీ తమిళనాడు బార్డర్ ప్రాంతం అయిన కుప్పం ప్రాంతంలో నిన్న ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. సరిహద్దుల్లో బంగారు నాణాల కలకలం రేగింది. రోడ్డు పక్కనే ఉన్న ఒక మట్టి దిబ్బలో పురాతన బంగారు నాణాలు బయట పడ్డాయి. దీంతో రోడ్డు మీద దొరికిన బంగారు నాణాల కోసం జనం భారీగా ఎగబడ్డారు. నిజానికి ఇలాంటివి ఏమన్నా దొరికితే పోలీసులకి, లేదా రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

వారు పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ బంగారం కావడంతో జనం ఎన్ని నాణాలు దొరికితే అన్ని సొంతం చేసుకుని సైలెంట్ గా జారుకున్నారు. ఈ నాణాల మీద అరబిక్ లిపితో అక్షరాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే వందల ఏళ్ల క్రితం బంగారు నాణాలు ఈ రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలోకి ఎలా వచ్చాయన్న దాని మీద పోలీసుల విచారణ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం హోసూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news