కేంద్రం సుకన్య సమృద్ధి పధకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసినదే. ప్రభుత్వం అందిస్తున్న ఈ పధకం వలన ఎంతో మంచి లాభం కలుగుతుంది. మీరు కనుక ఇందులో డబ్బులు పెడితే మీ కూతురికి బంగారు భవిష్యత్ కానుకగా ఇవ్వొచ్చు. ఇప్పటి నుండి మీరు కనుక ఈ పధకం లో డబ్బులు పెడితే మీ కూతురు పెళ్లి కి లేదంటే చదువుకి ఖర్చు పెట్టొచ్చు. అయితే మీరు దీని కోసం రోజుకు రూ.10 ఆదా చేస్తే సరిపోతుంది. అదేమిటి రూ.10 ఎం వస్తుంది అని అనుకుంటున్నారా..? అయితే దీనిని పూర్తిగా చూడాల్సిందే..!
మీరు కనుక సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరారంటే… ? కేంద్ర ప్రభుత్వం అందించే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో నుండి ఈ బెనిఫిట్ పొందొచ్చు. మీరు కేవలం రూ.250తో సుకన్య సమృద్ధి అకౌంట్ తెరిస్తే చాలు… ప్రతీ సంవత్సరం కూడా రూ.250 డిపాజిట్ చేసినా చాలు. మీరు ఇందులో రూ.1.5 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.
10 ఏళ్ల లోపు ఆడ పిల్లల పేరు పై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పన్ను మినహాయింపు ప్రయోజనాల తో పాటు 7.6 శాతం వడ్డీ వస్తుంది. అలానే అకౌంట్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 21 ఏళ్లు. 15 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. రోజుకి 10 ఆదా చేసి ఏడాదికి రూ.3,650 ఇందులో పెట్టినా మెచ్యూరిటీ సమయం లో చేతికి రూ.1.6 లక్షలు వస్తాయి.