ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పరంపర కొనసాగుతోంది. షాట్ పుట్ లో తజిందర్ పాల్ సింగ్ పసిడిని సాధించడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. దీంతో ఇప్పటి వరకు ఏడు స్వర్ణపతకాలు, 17కాంస్యం, ఐదు రజతం ఉన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్ పాల్ గుండును 20.75 మీటర్లు విసిరి తన సత్తాను చాటారు. దీంతో అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు. చైనా ఆటగాడు లియూ యుంగ్ 19.52 మీటర్లతో రజతం, కజకిస్తాన్ అథ్లెట్ ఇవనోవ్ ఇవాన్ 19.40 మీ.కాంస్యం అందుకున్నారు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ ఐదో ప్రయత్నంలో 20.75 మీటర్లు విసిరాడు..దీంతో భారత్ స్వర్ణం సాధించింది.