ఆఫ్రికా దేశంలోని సూడాన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బంగారం గని కూలడంతో ఏకంగా 38 మంది మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ గని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం గని మూసి ఉంది చనిపోయిన వారు కూడా గనిలో పనిచేసే కార్మికులు కాదు. కొంతకాలం గా ప్రభుత్వం ఈ గనిని మూసివేసింది.
అప్పటి నుండి స్థానికులు ఆశ తో బంగారం ఎతుక్కోవడానికి గనికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే 46 మంది పై ఒక్కసారిగా బంగారం గని కూలిపోయింది. ఈ ప్రమాదం లో 38 మంది ప్రాణాలు కోల్పోగా 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తో ముప్పై ఎనిమిది మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది.