కొన్ని రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా పడిపోతున్నాయి. వరసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా తగ్గు ముఖం పట్టింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఈ మేరకు ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 50,070కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.45,900కి చేరింది.
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచి బాగా తగ్గింది. ఏకంగా రూ.1,200 పడి పోయింది. దీంతో వెండి ధర రూ.66,800కు చేరింది. అయితే దేశేయంగా బంగారం ధరలు పడిపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1840 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.60 శాతం పెరుగుదలతో 24.13 డాలర్లకు చేరింది.