ఈ రోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ లో పర్యటించనున్నారు. కేంద్రం నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న కిషన్ రెడ్డి, అధికారులతో సమీక్షజరపనున్నారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించనున్నారు. రాబోయే జీడబ్ల్యూఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నగ్ధం చేయడానికి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నట్టు చెబుతున్నారు. పర్యటన వివరాలు ఈ మేరకు ఉన్నాయి. ఉ .9.00 గంటలకు భద్రకాళి గుడి సందర్శిస్తారు. 9.45 గంటలకు కేఎంసీ ఆవరణలో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శిస్తారు.
11.00 గంటలకు హృదయ్ పథకం కింద చేప ట్టిన భద్రకాళి బండ్ పనును పరిశీలిస్తారు. 11.50 గంటలకు హన్మకొండ పద్మాక్షి గుడికి ఎదురుగా గల అగ్గలయ్య గుట్టపై హృదయ్ పథకం కింద అభివృద్ధి చేసిన జైన తీర్థంకరుల పర్యాటక స్థలం పరిశీలిస్తారు. 12.30 నుంచి 100 గంట వరకు సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో రైల్వే అధికారులతో కాజీపేట రైల్వే బ్రిడ్జిపై సమీక్ష నిర్వహిస్తారు. 1.00 గంట నుంచి 2 గంటల వరకు నగరంలో అమలవుతున్న స్మార్ట్ సిటీ , అమృత్ ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 2.30 గంటలకు సర్క్యూట్ హౌస్ లో భోజనం చేస్తారు. 2.30 గంటలకు న్యూశాయంపేటలోని టీవీఆర్ గార్డెన్ లో బీజేపీ సమావేశానికి హాజరు అవుతారు. 4:30 గంటలకు సూర్యాపేట జిల్లా నకిరేకల్ పట్టణానికి ప్రయాణం అవుతారు.