బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్, ఈరోజు బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పడిపోవడం ఆశ్చర్యకరమే. ఇక హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.780 తగ్గడంతో మొత్తం రూ.50,950కు పడిపోయింది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 390 రూపాయలు తగ్గడంతో దాని ధర రూ.46,700కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో తగ్గింది. కేజీ వెండి ధర రూ.750 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.62,000కు పడిపోయింది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1919 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 25.10 డాలర్లకు పెరిగింది.