విజయవాడలో మహేష్ అనే యువకుడి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సీపీఓ ఉద్యోగి మహేష్ ని తుపాకీ తో కాల్చి హత్య చేసిన కేసులో మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు. మద్యం మత్తులో వివాదం జరగ డంతో హైదరాబాద్ కి చెందిన సాకేత్ రెడ్డి కాల్పులు జరిపాడు అని ఆయన మీడియాకు వివరించారు.
ఘటన జరిగినపుడు సాకేత్ రెడ్డితో పాటు గంగాధర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అని తెలిపారు. సాకేత్ రెడ్డికి బెజవాడ ఆటో డ్రైవర్ రాధాకృష్ణ రెడ్డి స్నేహితుడు అని ఆయన చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాధాకృష్ణ రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ ఘటనా స్థలానికి మద్యం తాగటానికి వచ్చాడు అని అన్నారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతోపాటు, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి సాకేత్ రెడ్డిని పిలిపించాడు అని చెప్పారు. కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ గ్రూప్ మద్యం మత్తులో మహేష్ గ్రూప్ తో వివాదం జరగడంతో మహేష్ పై సాకేత్ కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. సాకేత్ ఎప్పుడూ రివాల్వర్ ను క్యారీ చేస్తున్నాడని.. బీహార్ గయాలో 45,000కి దీన్ని కొన్నారని అన్నారు.