మళ్ళీ పెరిగిన బంగారం ధర…!

-

బుధవారం ఉదయం తగ్గినట్టే తగ్గిన బంగారం ధర సాయంత్రానికి మళ్ళీ పెరిగింది. మంగళవారం హైదరాబాద్ లో బంగారం ధర భారీగా తగ్గింది. దాదాపు వెయ్యి వరకు తగ్గిన ధర… బుధవారం ఉదయం కూడా అలాగే తగ్గింది. కాని బుధవారం సాయంత్రానికి బంగారం మళ్ళీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో దాదాపు 600 కి పైగా పెరిగింది. 24 క్యారట్ల బంగారం ధర రూ.670 పెరిగి రూ.42,970 ధరకు చేరుకుంది.

అదే విధంగా 22 క్యారట్ ధర రూ.690 పెరిగి 39,390 ధరకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో కాస్త పెరిగింద్ బంగారం… 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.311 పెరిగి రూ.40,241 ధరకు చేరుకుంది. దాదాపు పది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయిదు సెషన్స్ లో 5 వేల వరకు బగారం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి.

కొన్ని రోజులుగా కరోనా క్రమంగా విస్తరించడం తో కొనుగోలు కూడా భారీగా తగ్గింది. పెళ్ళిళ్ళ సీజన్ అయినా సరే కరోనా ఉన్న నేపధ్యంలో జనాలు కొనుగోలు తగ్గించారు. ఇప్పటికే వ్యాపార సముదాయాలను కూడా ప్రభుత్వాలు మూసి వేయడంతో బంగారం కొనుగోలు తగ్గింది. అయితే కొనుగోలు చేసే వారు మాత్రం ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిది. కరోనా తగ్గి స్టాక్ మార్కెట్ పుంజుకుంటే పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news