కెసిఆర్ ని ఫాలో అయిన జగన్, అన్నీ బంద్…!

-

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్కడిక్కడ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకి వెళ్తున్నాయి. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే దాదాపు 30 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కరోనా తీవ్రతను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31వరకు స్కూల్స్, కాలేజీలు బంద్ చేయాలని నిర్ణయం. కోచింగ్ సెంటర్ తో పాటు అన్నీ మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అలాగే ప్రజలు కూడా గుంపులు గుంపులుగా తిరగకుండా జాగ్రత్తలు పడాలని చెప్పింది.

ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల విద్యా సంస్థలను రద్దు చెయ్యాలని సూచించింది. ఆదేశాలను కాదని నడిపిస్తే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news