ప్రపంచ దేశాల్లో అత్యంత విలువైన వస్తువు బంగారం. ప్రపంచంలో దీనికి ఉండని డిమాండ్ బంగారానికి ఉంది. ఇక మన దేశంలో నైతే.. బంగారం కొనేందుకు.. మహిళలు ఎగబడతారు. అయితే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో… బంగారం ధరలు ఆకాశాన్ని అట్టుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజు కు పెరగడమే తప్ప ఏనాడూ తగ్గలేదు బంగారం ధరలు.
అటు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. అయితే.. గత రెండు రోజులుగా స్థిరంగా బంగారం ధరలు.. ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరల వివరాల్లోకి వెళితే..హై దరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 190 వరకు పెరిగి.. రూ. 44950 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 210 వరకు పెరిగి… 49, 040 కి చేరుకుంది. బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు కూడా కాస్త పెరిగి పోయాయి. కిలో వెండి ధర ఏకంగా… రూ. 600 పెరిగి పోయి.. 65, 600 లకు చేరుకుంది.