ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.
తాజాగా మరో సారి బంగారం ధరలు పెరిగిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 46,550కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 50, 780 కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుదలలో బంగారంతో పోటీ పడుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1100 కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,600 గా నమోదు అయింది.