బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. శుక్ర వారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.
10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 150 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 160 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50, 840 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46, 600 గా నమోదయింది. ఇక వెండి ధరలు కూడా కాస్త తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ.50 తగ్గి పోయి.. రూ. 63, 000 గా నమోదు అయింది.