బరువు తగ్గాలనుకుంటున్నారా? కానీ ఆకలి చంపేస్తుందా? ఇది తెలుసుకోండి.

-

బరువు తగ్గాలనుకునేవారు ఆకలిని అదుపులో పెట్టుకోవాలని చూస్తారు. ఆకలి అవుతున్నప్పుడల్లా ఎక్కువ తింటున్నామేమో? బరువు పెరుగుతున్నామేమో అని అనిపిస్తూనే ఉంటుంది. అదీగాక చాలా గంటల సేపు ఆకలి అవుతుంటే ఆగలేక చక్కెర ఎక్కువ కలిగిన పదార్థాలని తింటూ ఉంటారు. దీనివల్ల బరువు తగ్గాలను అనుకున్నదానికి అడ్డు తగులుతుంది. చక్కెర కలిగిన పదార్థాలు తినడం వలన బరువు పెరుగుతారు. కానీ ఆకలి వేస్తున్న సమయంలో అలాంటివి పట్టించుకోరు.

weight loss

ఐతే ఇలాంటి టైమ్ లో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

భోజనాన్ని ప్లాన్ చేసుకోండి.

అవును భోజన సమయాన్ని, ఏ సమయంలో ఎలా తినాలనే దాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ అర్థం అవుతుంది ఏంటంటే, బ్రేక్ ఫాస్ట్ కి చాలా ప్రాముఖ్యత ఉందని. అందుకే పొద్దున్న పూట బ్రేక్ ఫాస్ట్ కి హెవీ ఫుడ్ తీసుకోవద్దు. దానివల్ల

బద్దకం ఏర్పడి పని మీద ప్రభావం చూపించవచ్చు.

బ్యాలన్స్

మీరేం తీసుకున్నా అది సమతూకంలో ఉండాలి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సరైన పాళ్ళలో తీసుకోవాలి. పీచు పదార్థాలు తప్పకుండా ఆహారంలో భాగంగా ఉండాలి. వీటివల్ల జీర్ణక్రియ మెరుగవడమే కాకుండా ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది.

స్నాక్స్

సాయంత్రం పూట ఛాయ్ సమోస కంటే మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యకరమైనవి. ఆరోగ్యం బాగుండడంతో పాటు బరువు తగ్గేందుకు సాయపడతాయి. ఇంకా రోజు వారి జీవితంలో నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news