షాకింగ్ : 4.5 కోట్ల విలువైన బంగారం సీజ్..

-

ఈమధ్య కాలంలో బంగారం స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. ఆ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ అని కాకుండా దాదాపు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో రోజు కేజీల కొద్దీ బంగారం పట్టుబడుతూ ఉండడం సంచలనంగా మారుతోంది. తాజాగా కేరళలోని కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. 13 మంది స్మగ్లర్ల నుంచి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల విలువ చేసే బంగారం సీజ్ చేశారు..

మొత్తం స్మగ్లర్స్ నుంచి దాదాపు 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇదే ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ కూడా పట్టుబడింది. ఒక ప్రయాణికుడి నుంచి దాదాపు 40 లక్షల విలువైన కరెన్సీ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. మరోపక్క ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇక్కడ 38 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని స్మగుల్ చేయాలని చూసిన ఒక ప్రయాణికుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version