న్యూఢిల్లీ: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. దీంతో దేశంలో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 46 వేల 310 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 47, 310గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 44,310గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,340గా వ్యాపారులు విక్రయిస్తున్నారు.
అటు విజయవాడలోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి. గత పది రోజుల్లో రెండు, మూడు రోజులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో బంగారం ధరలు పెరిగాయి. దీంతో బంగారం ప్రియులకు షాక్ తగిలినట్లైంది. అంతర్జాతీయం బంగారం ధరలు పెరగడంతోనే భారత్‌లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నిన్న కేజీ వెండి ఏ ధర ఉందో ఈ రోజు కూడా అదే రేటు ఉంది. కేజీ వెండి ఈ రోజు రూ. 69.200గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 74,900గా విక్రయిస్తున్నారు. విజయవాడలోనూ రూ. 74,900గా ఉంది.