కేరళలోని మలప్పురం జిల్లా కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం నడుస్తున్నది. ఈ విషయం తనను ఆందోళనకు గురిచేస్తోందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో దీనిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా పరిగణించారు. దేశ భద్రత,జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందన్న సీఎం..ఆ విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని ఫైర్ అయ్యారు. ‘ఇలాంటి కీలక విషయాలను రాష్ట్రపతికి తెలపడం నా బాధ్యత కాదా?’ అని గవర్నర్ ప్రశ్నించారు.‘ఈ సున్నితమైన అంశంపై ఎందుకు సమాచారం ఇవ్వలేదనే దానిపై సీఎంను వివరణ కోరకూడదా ?’ అని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రశ్నించారు.
‘మలప్పురం గోల్డ్ స్మగ్లింగ్‌పై నేను ప్రశ్నించగానే సీఎం విజయన్ స్వరం మార్చారు. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలు అనే పదాలే తాను వాడలేదని నాకు లేఖ పంపారు’ అని గవర్నర్ ఫైర్ అయ్యారు.‘మలప్పురం గోల్డ్ స్మగ్లింగ్ ముఠాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోందని..పన్నుల ఎగవేతకు అవకాశం కలుగుతుందని అదే లేఖలో సీఎం ప్రస్తావించారు. మరి వాటి సంగతేంటి?’అని కేరళ సీఎంను గవర్నర్ ప్రశ్నించారు.