ఒంటిమిట్ట సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు.. పెన్నాసిమెంట్స్ అధినేత భారీవిరాళం

-

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. నేడు సీతారాములోరి కళ్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఈ క్రమంలోనే సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు బహుమతిగా వచ్చాయి.

ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల వజ్రాల స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత పి.ప్రతాప్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. 7 కేజీల బంగారంతో తయారైన మూడు కిరీటాలను టీటీడీ చైర్మన్, ఈవోలకు అందించి, పూజల తర్వాత అలంకరించారు. ఈ స్వర్ణ కిరీటాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news