భామ పూజా హెగ్డే విజయం వెనక అసలు రహస్యం ఇదేనా….??

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అని అనిపించుకోనప్పటికీ, తన పెర్ఫార్మన్స్ మరియు అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వరుణ్ తేజ్ ముకుంద, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన నటించిన మొహంజదారో సినిమాలతో భారీ ఫ్లాప్స్ ని మూట గట్టుకుంది. ఇక ఆ తరువాత బన్నీ సరసన నటించిన డీజే సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ భామ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేతలో నటించి తొలి సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

 

ఇక అక్కడి నుండి పూజకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు రాసాగాయి. మధ్యలో రామ్ చరణ్ రంగస్థలం లో ప్రత్యేక గీతంలో మెరిసి మాస్ ని ఊపేసిన పూజ, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాల్లో నటించి మరొక రెండు సూపర్ హిట్స్ దక్కించుకుంది. అయితే ఆ విధంగా పూజకు వరుస విజయాలు దక్కడానికి ఒక రహస్యం కూడా దాగుందట. అదేమిటంటే, ఒకప్పుడు సిమ్రాన్, ఇలియానాల తరువాత మంచి బాడీ ఫిజిక్ కలిగిన పూజను క్లాస్ తో పాటు మాస్ పాత్రలకు దర్శక నిర్మాతలు ఆమెనే ఫస్ట్ చాయిస్ గా ఎన్నుకుంటున్నారట. నిత్యం యోగ, వ్యాయామం వంటివి చేయడం,

కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండడం, మంచినీరు తగు మోతాదులో సేవించడం వంటివి పాటించడం వల్లనే తాను ఎప్పుడూ పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేయగలుగుతున్నాను అని పూజ అంటోంది. కాగా ప్రస్తుతం అదే ఆమెకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతోంది. అయితే అది ఒక్కటి మాత్రమే కాదండోయి, ఈ విధంగా వరుసగా విజయాలు అందుకున్న ఆమె టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకోవడంతో, పలు నిర్మాతలు కూడా ఆమె డేట్స్ కోసం ఎగపడుతున్నారు. ఎంతైనా మన తెలుగు వారికి నమ్మకాలు ఒకింత ఎక్కువ కదా. ఇక ప్రస్తుతం మరొక్కసారి అల్లు అర్జున్ సరసన ఆమె నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రభాస్ సరసన ఆమె నటిస్తున్న జాన్ సినిమా వచ్చే ఏడాది ద్వితీర్ధంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి……!!Telugu Cinema

Read more RELATED
Recommended to you

Latest news