టీం ఇండియాకు ఆ లోటు తీరిపోయింది… దొరికేసాడు…!

-

నాలుగో స్థానం” క్రికెట్ లో ఈ స్థానం అనేది చాలా కీలకం… వన్డేలు అయినా టెస్టులు అయినా, టి20 అయినా సరే ఈ స్థానం మీదే టీం బలం ఆధారపడి ఉంటుంది… ఓపెనర్లు తల అయితే… మూడో స్థానం చాతి… నాలుగో స్థానం… వెన్నుముఖ… ఇది బలంగా ఉంటేనే టీం బ్యాటింగ్ లో సత్తా చాటే అవకాశం ఉంటుంది. అన్ని జట్లకు ఈ స్థానంలో బలం ఉన్న సరే టీం ఇండియా కు మాత్రం ఆ స్థానంలో సమస్య తీరడం లేదు. ద్రావిడ్, యువరాజ్ లాంటి ఆటగాళ్ళు మోసిన నాలుగు భారాన్ని యువ ఆటగాళ్ళు మోయడంలో విఫలమవుతున్నారు…

దినేష్ కార్తిక్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, అజింక్యా రహానే… ఇలా ఎందరో ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. అయినా సరే… వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ స్థానానికి సరైన ఆటగాడు దొరికారని అంటున్నారు క్రికెట్ అభిమానులు. అతని పేరే శ్రేయాస్ అయ్యార్… నిలకడకు మారు పేరు ఈ ఢిల్లీ కుర్రాడు… రెండేళ్ళ క్రితం జట్టులోకి వచ్చిన ఈ ఆటగాడు… వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు… 11 మ్యాచులు ఆడిన అయ్యర్… 9 ఇన్నింగ్స్ ల్లో ఆరు అర్ధ సెంచరీలతో 469 పరుగులు చేసాడు.

అవకాశం వచ్చిన ప్రతీ సారి తనలో సత్తా ఉందని నిరూపించుకుంటున్నా సరైన అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న సీరీస్ లో… తొలి రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. రెండు మ్యాచుల్లోను కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు… అతనిలో నాలుగో స్థానాన్ని మోసే సత్తా ఉంది. అయినా సరే సరైన అవకాశాలు మాత్రం ఇవ్వడంలో టీం ఇండియా విఫలమవుతుంది. అటు టి20ల్లో కూడా అయ్యర్ తన సత్తా చాటాడు. మరి ఈ స్థానానికి అతన్ని కొనసాగిస్తారో ప్రయోగాలు చేసి ఇతన్ని కూడా జట్టు నుంచి సాగనంపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news