నేడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు..

ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు (81) కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉ.11.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. తిరుగులేని రచయిత, భాషా ప్రావీణుడు, ప్రముఖ నటుడు, సాహితీ వేత్త అయిన గొల్లపూడి మారుతీరావు మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలను ఆదివారం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

అందువల్ల శనివారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి మార్చురీలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భౌతికకాయాన్ని… చెన్నైలోని… టి.నగర్‌ శారదాంబాళ్‌ వీధిలోని ఆయన ఇంటికి తీసుకొచ్చి… ప్రజల సందర్శన కోసం ఉంచారు. అలాగే నేటి ఉదయం 11 గంటలకు చెన్నైలోని… టి.నగర్‌ కన్నమ్మపేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నారు.