మరో అల్పపీడనం ఎఫెక్ట్ తో…తెలంగాణ, ఏపీకి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడిన ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 23 నాటికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం.
దీని ప్రభావంతో 24, 25 తేదీలలో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచనలు జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. సముద్రంలో ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు అమరావతి వాతావరణ కేంద్రం. 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది.