12 కోట్ల మంది అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు ఎప్పుడంటే..?

-

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 11వ విడత డబ్బులు అందించనుంది. వచ్చే నెలలో రైతుల బ్యాంక్ అకౌంట్ లో కేంద్రం రూ.2 వేలు జమ చేయనుందని తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏప్రిల్ – జూలై లో రెండు వేలు వస్తాయి. అయితే డబ్బులు కనుక మీరు పొందాలంటే కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి.

farmers

ఇది అవ్వాలంటే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి. పైగా ఎక్కడికీ వెళ్లాల్సిన పనే లేదు. ఇంట్లో నుంచే ఇకేవైసీ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇకేవైసీ పూర్తి చేసుకోవాలని అనుకుంటే ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. https://pmkisan.gov.in/ ద్వారా మీకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది.

ఇందులో ఇకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి
తర్వాత ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చెయ్యాలి. మీకు ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీని ఎంటర్ చేయాలి అంతే.

లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా దీనిని చేసుకోచ్చు. ఇకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు కచ్చితంగా డబ్బులొస్తాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి ఏటా రూ.6 వేలు ఇస్తోంది. మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు రైతులకు 10 విడతల డబ్బులు అందాయి. ఇప్పుడు 11వ విడత డబ్బులు రవళి.

Read more RELATED
Recommended to you

Latest news