రేపు ఉగాది పర్వదినం. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2 వ తేదీని సెలవు దినంగా ప్రకటిచింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాల రాజు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే.. ఉగాది రోజుల కొత్త జిల్లాల ప్రకటన చేస్తున్నందున ఏప్రిల్ 2 వ తేదీన సెలవు లేదని ప్రకటన చేసింది సర్కార్.
దీనిపై పలు విజ్ఙప్తులు రావడంతో… జగన్ సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రేపటి రోజున హాలిడే ప్రకటిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు తేదీని ఏప్రిల్ 4 వ తేదీకి వాయిదా వేసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దీంతో ఉగాది పండుగకు సెలవు వచ్చింది. దీంతో ఏపీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. కాగా.. కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల అవతరణ చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.