ఏపీలోని ఆక్వా రైతులకు గుడ్న్యూస్. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఆక్వా సాగుచేసే రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆక్వా జోన్ పరిధిలో ఆసైన్డ్, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూమిని లీజుకు తీసుకుని ఆక్వా సాగు చేసే పది ఎకరాల్లోపు వారికి కూడా విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అటు నాన్ ఆక్వాజోన్లలో అర్హమైన ఆక్వాజోన్ లను గుర్తించగా, రాష్ట్ర కమిటీ ఆమోదంతో త్వరలో గెజిట్ నోటిఫికేషన్ రానుంది.