బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ సేవలు 24 గంటలూ..!

-

బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. బ్యాంకింగ్ సర్వీసులను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలని కేంద్రం అనుకుంటోంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త సర్వీసులు తీసుకురానుంది. దీని వలన బ్యాంక్ కస్టమర్స్ కి ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

బ్యాంకింగ్ సేవలను రోజులో 24 గంటల పాటు, వారంలో 7 రోజుల పాటు అందుబాటులో ఉంచేందుకు చూస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల గురించి మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఇలా ఉంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.

అన్ని కమర్షియల్ బ్యాంకులకు ఇవి వర్తిస్తాయి. కానీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులను మాత్రం మినహాయించారు. అయితే ఈ డిజిటల్ యూనిట్స్ వలన మనకేంటి లాభం అనేది చూస్తే.. ప్రతి బ్యాంక్ స్మార్ట్ ఎక్విప్‌మెంట్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రా‌క్విట్ టెల్లర్ మెషీన్స్, ఇంటరాక్టివ్ బ్యాంకర్స్, సర్వీస్ టర్మినల్స్, టెల్లర్స్, క్యాష్ రీసైక్లర్స్ ఇవన్నీ కూడా ఉండాలి.

అలానే డాక్యుమెంట్ అప్‌లోడింగ్ కోసం ఎక్విప్‌మెంట్, సెల్ఫ్ సర్వీస్ కార్డ్ ఇష్యూయెన్స్ మొదలైన సేవలు అందిస్తారు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో కస్టమర్లు సొంతంగా అకౌంట్ ఓపెన్ చేసుకోచ్చు. అలానే ఇతర సేవలను కూడా పొందొచ్చు. సెల్ఫ్ సర్వీస్‌తో పాటుగా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వీటిల్లో వుంది హెల్ప్ చేస్తారు. పైగా ఇవి 24 గంటలూ తెరిచే ఉంటాయి. వారంలో అన్ని రోజులు పని చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news