గుడ్ న్యూస్: కెనరా బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..!

-

కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను అందించింది. బ్యాంక్ లో ఖాతాదారులుగా కొనసాగుతున్న వారికి కరోనా కవచ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. రోజుకు దేశంలో 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంక్ కస్టమర్లకు చేయూతగా నిలిచింది. బ్యాంకు తన కస్టమర్లకు అదిరిపోయే సర్వీసులు అందించి అందరికి తీపి కబురు తెలిపింది.

Canara-Bank-Corona-Kavach-Health-Insurance-Policy
Canara-Bank-Corona-Kavach-Health-Insurance-Policy

కెనరా బ్యాంక్ తాజాగా బ్యాంకు ఖాతాదారులకు కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చింది. పాలసీకి సంబంధించి ఇప్పటికే మూడు ఇన్సూరెన్స్ కంపెనీలతో కెనరా బ్యాంక్ ఒప్పందం కుదర్చుకుంది. ఈ పాలసీ తీసుకున్న వారు కరోనా బారిన పడినా ఖర్చుకు వెనకాడాల్సి అవసరం లేకుండా, డబ్బులు లేవని భయపడాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. ముందుగా ఈ స్కీంలో చేరిన వారికి ఉచితంగా కరోనా చికిత్స అందించనున్నారు. దీనికి సంబంధించి కెనరా బ్యాంక్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్ డీఎఫ్ సీ అగ్రో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కెనరా బ్యాంక్ ఖాతాదారులు తమకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కరోనా పాలసీని పొందవచ్చని వెల్లడించింది.

బ్యాంక్ ఖాతాదారులు కరోనా కవచ్ పాలసీలో చేరాలని అనుకుంటే ప్రీమియం రూ.300 నుంచి చెల్లించుకోవచ్చని, ఈ స్కీం ద్వారా రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు కరోనా హెల్త్ కవరేజీని పొందవచ్చు. ఈ కరోనా కవచ్ ఇన్సూరెన్స్ పాలసీ తొమ్మిదిన్నర నెలల పాటు కొనసాగుతుంది. కరోనాతో భయపడుతున్న వారికి ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుందని బ్యాంక్ వెల్లడించింది. కరోనా ఒకవేళ వచ్చినా చికిత్స పొందేంత వరకు వీలుగా డబ్బులు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇక బ్యాంక్ ఖాతాదారులు తప్పనిసరిగా స్కీంను వినియోగించుకోవాలని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news