కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! ప్రభుత్వం..ఇప్పుడు గృహ నిర్మాణ రంగంపై దృష్టి సారించింది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందకు పలు రాయితీలుప్రకటిస్తోంది. కొత్తగా గృహ నిర్మాణ రుణం తీసుకోబోయే ఉద్యోగులకు వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 7.9 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఈ పథకం ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్ర‌క‌టించింది.

ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల కొనుగోళ్లు లేదా నిర్మాణాలు చేపడితే గృహ నిర్మాణ రంగం మళ్లీ గాడిలో పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే దసరా కానుకగా ఉద్యోగులకు వడ్డీ రేట్లను తగ్గించి ప్రభుత్వం గూడ్ న్యూస్ ప్ర‌క‌టించింది. అలాగే రుణ మొత్తంతో సంబంధం లేకుండా ఏడాదిపాటు ఈ వడ్డీ తగ్గింపు అమల్లో ఉంటుందని కూడా తెలిపింది. శాశ్వత ఉద్యోగులు, బ్రేక్‌ లేకుండా ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్న తాత్కాలిక సిబ్బంది ఈ వడ్డీ తగ్గింపునకు అర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news