తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక కాకా రేపుతోంది. అలాగే హుజూర్‌నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన కూడా పూర్తైంది. బరిలో నిలిచే అభ్యర్థులెంతమందో తేలిపోయింది. గురువారంతో నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ ముగించారు. ఈ క్రమంలోనే 28 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు.
శుక్రవారం సాయంత్రం 4-9 గంటల మధ్య లింగగిరి రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు హుజూర్‌నగర్ పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు హుజూర్‌నగర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి పలు దేవాలయాల్లో పూజలు చేసిన అనంతరం ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా కోదండరాం హుజూర్‌నగర్ రానున్నారు.