కరోనా బాధితులకు గుడ్ న్యూస్.. ఆ టాబ్లెట్ తో మంచి ఫలితాలు

-

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సిన్లు, టాబ్లెట్లు అంటూ అనేక రకాల మెడిసిన్స్ వస్తున్నాయి. అయితే కరుణ రోగుల చికిత్సల్లో టాబ్లెట్ల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మోనో క్లోనల్ యాంటీబాడీస్, రెమీడేసివీర్ లాంటివాడిని సూది సాయంతో శరీరంలోకి తీసుకుంటున్నారు. ఫావిపిరవిర్ మాత్రమే టాబ్లెట్ల రూపంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి.

తాజాగా మెల్ను పిరవిర్ కు అమెరికా, యూకే సహారా ఇండియా కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో ఇండియాలోనే దాదాపు పదమూడు కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరుతో దీనిని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా మహమ్మారి పై పోరాటం ఈ ఏమి రామబాణం కాకపోయినప్పటికీ… ఆశాజనక ఫలితాలను ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఆర్.ఎన్.ఎ ను లక్ష్యంగా చేసుకుని ఇది పని చేస్తోంది. ఫలితంగా రోగి లో వైరల్ లోడ్ గణనీయంగా తగ్గుతోంది. దీంతో కరోనా రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ టాబ్లెట్ను వాడితే త్వరగా కోలుకోవాలని చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news