డిసెంబర్ 31″ ఎవరు అన్నారో గాని ఇది ప్రపంచ తాగుబోతుల దినోత్సవం అని… అప్పటి వరకు మందు రుచి తెలియని వాడు కూడా ఆ రోజు బీర్ తాగడమో, లేక ఒక బ్రీజర్ అయినా, ఒక పెగ్ అయినా తాగడం మనం చూస్తాం. ఇక తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఆరోజు తాగి తూలడం మనం చూస్తాం. ఎంత తాగుతారో ఎం తాగుతున్నారో తెలియకుండా తాగుతారు. ప్రపంచం మొత్తం వాళ్ళదే అన్నట్టు భావిస్తున్నారు.
ఇక ఈ సందర్భంగా తాగిన వాళ్ళు సంబరాలు చేసుకుంటూ కొన్ని అవాంచనీయ సంఘటనలకు కూడా పాల్పడటం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. దీనితో పోలీసులు వారిపై చర్యలకు సిద్దమయ్యారు. ఆ రోజున అనేక ఆంక్షలు విధిస్తూ జనాలను కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో బెంగుళూరు మెట్రో అధికారులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 1న అర్ధరాత్రి 2 గంటల వరకు న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో సర్వీస్‌లను ప్రజలకు,
అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లలో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం మందు బాబులపై అమలు చేస్తున్న ఆంక్షలను ఈ సందర్భంగా సడలించారు అధికారులు. న్యూ ఇయర్ రోజు బ్రీత్ అనలైజర్ టెస్టును మినహాయిస్తున్నట్లు అధికారులు కీలక ప్రకటన చేసారు. దీనిపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.