గృహిణిలకి గుడ్ న్యూస్.. ఈ 5 చోట్ల డబ్బులు పెడితే అదిరే రాబడి పొందొచ్చు..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చెయ్యడానికి కూడా చాలా ఆప్షన్స్ వున్నాయి. మీరు ఎంచుకునే దానిని బట్టి మీకు లాభం వస్తుంది. అయితే మరి గృహిణుల కోసం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

గృహిణిలు చక్కగా ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు పొందొచ్చు. పలు స్కీమ్స్ వంటివి వున్నాయి. వీటి ద్వారా మంచిగా డబ్బులను పొందొచ్చు. ఈ 5 చోట్ల డబ్బులు పెడితే అదిరే రాబడి గృహిణిలకి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్‌: మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే అదిరే రాబడి వస్తుంది. దీర్ఘకాలంలో మంచి రాబడి దీని ద్వారా వస్తుంది. సిప్ ఆప్షన్ ద్వారా ప్రతి నెలా డబ్బులు మనం పెట్టచ్చు. నెలకు రూ.500 నుంచి దీనిలో ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

బాండ్లలో ఇన్వెస్ట్: మహిళలు బాండ్లలో కూడా డబ్బులు పెట్టొచ్చు. ఏ రిస్క్ ఉండదు. అలానే ఇందులో డబ్బులు పెడితే సేఫ్. వీటిల్లో రాబడి కూడా తక్కువగానే ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌: మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ లో కూడా డబ్బులు పెట్టచ్చు. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచిగా రాబడి వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. రిస్క్ కూడా ఉండదు. పక్కా లాభమే. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.

NSC పథకం: NSC పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మీ వద్ద రూ. 1000 ఉంటే చాలు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దీనికి ఇప్పుడు 6.8 శాతం వడ్డీ లభిస్తోంది.

స్టాక్ మార్కెట్‌: స్టాక్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే హై రిస్క్ ఉంటుంది. రాబడి ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news