తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల పై కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి తప్పులు జరుగలేదని… 70 శాతం సెలబస్ తోనే పరీక్షలు నిర్వహించామన్నారు. కానీ విపక్షాలు రాజకీయ లబ్ది కోసమే ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు, పేరేంట్స్ సంయనం పాటించాలన్నారు. 35 మార్కులు వేసి ఈ సారి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పాస్ చేస్తున్నామన్నారు సబితా. మినిమమ్ మార్కులతో అందరిని పాస్ చేస్తున్నామని ప్రకటన చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు రాబోవని.. వచ్చే పరీక్షల్లోనైనా బాగా చదువాలన్నారు.
కరోనా వల్ల అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయని… విద్యా వ్యవస్థ కూడా ఇబ్బందులు పడిందన్నారు సబితా ఇంద్రారెడ్డి. 3వ తరగతి నుంచి పీజీ వరకు టి సాట్, డిజిటల్ క్లాసులు నిర్వహించామని.. దూరదర్శన్ ద్వారా కూడా క్లాసులు ఆషామాషీగా చెప్పలేదని ఆమె వెల్లడించారు.
95 శాతం మంది ఇంటిలో దూరదర్శన్, 40 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. వాట్సాప్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు క్లాసులు భోదించామని.. 9వ తరగతి పిల్లలని 10కి పంపించాము. 10th వాళ్ళను ఇంటర్ కు పంపామని చెప్పారు. పిల్లలకు ఇంటర్ టర్నింగ్ పాయింట్ అని.. మంచి విద్య కోసం 900 గురుకులాలు ఏర్పాటు చేశామని ప్రకటన చేశారు. 620 గురుకులాల్లో ఇంటర్ క్లాసులు బొదిస్తున్నామని..122 కస్తూర్బా పాఠశాలలు అప్ గ్రేడ్ చేశామన్నారు.