ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్… ఈ ఏడాది 70 శాతమే సిలబస్

ఇంటర్‌ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ లో 70 శాతం సిలబస్ ఉండనున్నట్లు కీలక ప్రకటన చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, ద్వితీయ సంవత్సరానికి 70 శాతం సిలబస్ నుండే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఇంటర్‌ బోర్డు.

కోవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలలో భౌతిక తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం తో 70 శాతం సిలబస్ తోనే విద్యా సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ లో ఈ 70 శాతం సిలబస్ గురించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయని ప్రకటన చేసింది. గత విద్యా సంవత్సరం కూడా 70 శాతం సిలబస్ నుండే ఇంటర్ పరీక్షలు నిర్వహించామని.. అదే రితీలో ఈ సారి కూడా నిర్వహిస్తామని పేర్కొంది. అలాగే… ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరో సారి పొడగించింది. ఇప్పటికే పలు మార్లు పొడగించిన ఇంటర్ బోర్డ్… తాజాగా ఈ నెల 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదే చివరి పొడగింపు అని పేర్కొంది ఇంటర్ బోర్డ్.