ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి పరంగా మంత్రి పదవుల్లో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణాజిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ గత కొంత కాలం నుండి మంత్రి పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం శాసన మండలి రద్దు అయ్యే అవకాశం ఉన్నా ఈ నేపథ్యంలో ఇద్దరి మంత్రి పదవులు పోయే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో ఆ రెండు మంత్రి పదవులను వైయస్ జగన్ ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
పార్టీ కి అనుగుణంగా మరియు సామాజిక వర్గ లెక్కల ప్రకారం వైయస్ జగన్ ఆలోచిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్ కి అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ కి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వీరిద్దరితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరొకరి పేరు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఇద్దరికీ గ్యారెంటీగా ఆ రెండు మంత్రి పదవులు కట్టబెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి.
జోగి రమేష్ అదేవిధంగా చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ మంత్రులు అయితే ఖచ్చితంగా ఇది కృష్ణ మరియు తూర్పు గోదావరి జిల్లాలకు సూపర్ గుడ్ న్యూస్ అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క మంత్రి పదవులు పోగొట్టుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణకు జగన్ ఎటువంటి నామినేటెడ్ పదవులు అప్పగిస్తారో అనేది కూడా వైసీపీ పార్టీలో చర్చకు వస్తోంది.