ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభా కార్యకలాపాలను రూల్స్ పరంగా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కనీసం బీఏసీ లో చర్చించకుండానే సొంతంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ ఎల్పీ నేతలు జగన్ పై సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను మరికొంతకాలం పొడిగించాలని కోరితే ఎటువంటి రెస్పాండ్ వైసీపీ ప్రభుత్వం నుండి రాలేదని ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని ఏకపక్షంగా డిసైడ్ అయ్యారని మండిపడ్డారు.
తమ డిమాండ్లను బీఏసీలో పట్టించుకోని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన బిల్లులు సెలెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నాయని వాటిని ఉద్దేశపూర్వకంగా జగన్ సర్కార్ అడ్డుకుంటుందని దాని వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందని టీడీపీ శాసనసభ నేతలు మండిపడుతున్నారు.
ఇవే విషయాలను ఒక లేఖ రూపంలో గవర్నర్ దృష్టికి భారీ ప్లాన్ దిశగా చంద్రబాబు న్యూ మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సంతకాలు చేసి తీసుకెళ్లిన నేపథ్యంలో..టీడీపీ ఇచ్చిన లేఖపై గవర్నర్ నుండి సరైన రెస్పాన్స్ రానట్లు సమాచారం. కారణం రాష్ట్రానికి పేద ప్రజలకు ఉపయోగపడాలి సేన ఇంగ్లీష్ మీడియం మరియు మరికొన్ని బలహీన వర్గాలకు చెందిన బిల్లుల విషయంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు శాసనమండలిలో వ్యవహరించిన తీరు ముందే గవర్నర్ తెలుసుకుని చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.