వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో వాటికి పన్నుకూడా రాయితీ : మంత్రి పొన్నం

-

వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యుత్ వాహనాలు కొంటే రోడ్డు ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తూ కొత్త ఈవీ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే కోవలో మరో కీలక నిర్ణయం దిశగా యోచిస్తున్నది. రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈవీ పాలసీ పై పోస్టు చేశారు. ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యం వంటి పరిస్థితి హైదరాబాద్, తెలంగాణలో రాకూడదనే మన రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చినట్టు తెలిపారు.

Minister ponnam prabhakar

ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈవీ పాలసీ ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ప్రజలు వాడేలా ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినట్టు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయించాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version