దావోస్ లోనే ఇంకా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారట. మరో రెండు రోజులు దావోస్ లో సమావేశాలు ఉన్నాయని సమాచారం. అందుకే దావోస్ లోనే ఇంకా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారట. ఈ నెల 27 న హైదరాబాద్ కి శ్రీధర్ బాబు రానున్నారని సమాచారం అందుతోంది.
ఇది ఇలా ఉండగా…దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డుస్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
ఇక శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దానం నాగేందర్ కూడా స్వాగతం పలికారు. కాగా, దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు రానున్నాయని సమాచారం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం.