విదేశాల్లో ఉండే వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్…!

-

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశానికి రాలేక అక్కడ ఉండలేక విదేశాల్లో నరకం చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అందరిని స్వదేశానికి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై ఇటీవల జరిగిన ఒక కేబినేట్ సమావేశంలో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో వాళ్ళను తీసుకురానున్నారు.cuddapah trujet flights timings changed

నౌకలు, విమానాల ద్వారా వారిని తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అక్కడి నుంచి రావడానికి ఖర్చు ప్రయాణికులే పెట్టుకోవాలి. విద్యార్ధులకు మాత్రం కేంద్రం కొంత సహాయం చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత హోం క్వారంటైన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఉండాలని చెప్తున్నారు. వాళ్లకు అక్కడ పూర్తిగా కరోనా పరిక్షలు చేసిన తర్వాతే తీసుకొస్తారు.

అక్కడ కరోనా లేదు అని తెలిస్తే వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని వారి పూర్తి వివరాలను నమోదు చేసి ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. 28 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మెడిక‌ల్ టెస్టులు, క్వారంటైన్ సెంట‌ర్స్ వంటి ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news