కరోనా లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు ప్రజలు పడుతున్న ఆర్ధిక ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లాక్ డౌన్ ని ఇప్పుడు కేంద్రం పెంచింది. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ని కేంద్రం పొడిగించే నిర్ణయం తీసుకుంది. దీనితో దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వ్యాపారాలు జరిగే అవకాశం కనపడటం లేదు. ఈ నేపధ్యంలోనే కేంద్రం సూచనతో రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
లాక్‌డౌన్ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయ మార్గాలు లేకపోవడంతో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను మరో 3 నెలలు పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ ని ఒక్కసారే ఎత్తేసే అవకాశం కూడా దాదాపుగా లేదు. దీనితో ఇప్పట్లో పూర్తి స్థాయిలో వ్యాపారాలు జరిగే అవకాశం లేదని బ్యాంకులు కూడా భావిస్తున్నాయి.
లాక్‌డౌన్ మొదలైన సమయంలో మూడు నెలల పాటు మారిటోరియం విధించగా దీని గడువు ఈ నెల31తో ముగియనుంది. లాక్ డౌన్ ని పెంచడమే మంచిది అనే అభిప్రాయం లో కేంద్రం ఉన్న నేపధ్యంలో మారిటోరియం ని కూడా మూడు నెలల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని సమాచారం.